Nanna : మా నాన్న...
పిల్లల్ని నవమాసాలు మోసిన
అమ్మ గొప్పతనం ఒక వైపుంటే,
ఆ సంతానాన్ని అమ్మతో సహా జీవితాంతం మోసే
నాన్న గొప్పతనం వేరొకవైపు ఉంది.
మూడు పూటలా రుచికరమైన భోజనం పెట్టేది అమ్మైతే,
ఆ భోజనం ఇంట్లోకి రావడానికి కారణం నాన్నే కదా!
దెబ్బ తగిలితే అమ్మా!అంటూ అరుస్తాం...
కాని మందు వేయించేది నాన్నే కదా!
పాకెట్ మనీ కోసం రికమండేషన్ చేసేది అమ్మ అయితే..
మన ఖాళీ జేబులు నింపేది నాన్నే కదా!
చిన్న చిన్న సమస్యలు అమ్మ తీరుస్తుంది...
సమస్య జటిలమైతే పరుగెత్తేది నాన్న వద్దకే కదా!
భూదేవంత ఓర్పు, సహనం అమ్మదైతే
ఆకాశమంత ఔన్నత్యం నాన్నది.
చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం...
పెద్దయ్యాక కనీసం ఆ రెక్కల భారాన్ని పంచుకునే
ప్రయత్నం కూడా చేయం...
కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి...
వెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.
ఆ కొబ్బరి నీళ్ళ తీపి...
ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,
నాన్నను ఎప్పటికీ వదలం....
'అమ్మ' వర్తమానాన్ని చూస్తే...
మన భవిష్యత్తుని మనకంటే ముందుగా చూసేదీ,
మనకు లక్ష్యాలను చూపేదీ,
వాటిని సాధించుకొనేందుకు బంగారు బాటలు వేసేది 'నాన్నే' కదా!
http://nannakupremathoram.blogspot.in/2016/12/Nannaku-Prematho-Ram-4.html
http://nannakupremathoram.blogspot.in/2016/12/Nannaku-Prematho-Ram-4.html
No comments:
Post a Comment