Nanna : ఇన్నాళ్లూ నీ చేతుల్లో నేను ..
Showing posts with label Nannaku Prematho. Show all posts
Showing posts with label Nannaku Prematho. Show all posts
Monday, 19 December 2016
Nanna : ఇన్నాళ్లూ నీ చేతుల్లో నేను ..
Nanna : మా నాన్న...
Nanna : మా నాన్న...
పిల్లల్ని నవమాసాలు మోసిన
అమ్మ గొప్పతనం ఒక వైపుంటే,
ఆ సంతానాన్ని అమ్మతో సహా జీవితాంతం మోసే
నాన్న గొప్పతనం వేరొకవైపు ఉంది.
మూడు పూటలా రుచికరమైన భోజనం పెట్టేది అమ్మైతే,
ఆ భోజనం ఇంట్లోకి రావడానికి కారణం నాన్నే కదా!
దెబ్బ తగిలితే అమ్మా!అంటూ అరుస్తాం...
కాని మందు వేయించేది నాన్నే కదా!
పాకెట్ మనీ కోసం రికమండేషన్ చేసేది అమ్మ అయితే..
మన ఖాళీ జేబులు నింపేది నాన్నే కదా!
చిన్న చిన్న సమస్యలు అమ్మ తీరుస్తుంది...
సమస్య జటిలమైతే పరుగెత్తేది నాన్న వద్దకే కదా!
భూదేవంత ఓర్పు, సహనం అమ్మదైతే
ఆకాశమంత ఔన్నత్యం నాన్నది.
చిన్నప్పుడు నాన్న భుజాల మీద స్వారీ చేస్తాం...
పెద్దయ్యాక కనీసం ఆ రెక్కల భారాన్ని పంచుకునే
ప్రయత్నం కూడా చేయం...
కొబ్బరిపెంకులాంటి నాన్న కరుకుదనానికి భయపడి...
వెన్నలాంటి మనసున్న అమ్మ చల్లని ఒడి చేరతాం.
ఆ కొబ్బరి నీళ్ళ తీపి...
ఆ లేత కొబ్బరి మెత్తదనం చూడగలిగితే,
నాన్నను ఎప్పటికీ వదలం....
'అమ్మ' వర్తమానాన్ని చూస్తే...
మన భవిష్యత్తుని మనకంటే ముందుగా చూసేదీ,
మనకు లక్ష్యాలను చూపేదీ,
వాటిని సాధించుకొనేందుకు బంగారు బాటలు వేసేది 'నాన్నే' కదా!
http://nannakupremathoram.blogspot.in/2016/12/Nannaku-Prematho-Ram-4.html
http://nannakupremathoram.blogspot.in/2016/12/Nannaku-Prematho-Ram-4.html
Nanna : అలాంటి నాన్న దేవుడి కన్న మిన్న
నాన్న అన్న పదము
కన్న
కమ్మగ వుండదు ఆ వెన్న
లక్షం వైపు దూసుకెళ్ళే బాణం మనమైనా
నాన్నలాంటి విల్లే లేక పోతే దాని ఫలితం సున్నా
నాన్న పెంపకములో కఠినత్వం వున్న
ఆ పెంపకానికి కారణం
రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన
రేపటి మనకు నిలువుటద్దం నాన్న
అలాంటి నాన్న దేవుడి కన్న మిన్న .
http://nannakupremathoram.blogspot.in/2016/12/Nannaku-Prematho-Ram-1.html
Nanna : అన్ని నీవై ..నీకు నీవే మలుచుకున్నావు నాన్నవై…
Nannaku Prematho Ram :
నాన్న..
తల్లివయ్యావు నాకు…..ఆలన పాలన లో
గురువయ్యావు నాకు….క్రమశిక్షణ లో
మిత్రుడయ్యావు నాకు…సుఖ దుఃఖాలలో
అన్నయ్యవయ్యావు నాకు…..అన్ని అవసరాలలో
తమ్ముడయ్యావు నాకు…ఆట పాటలలో
అక్కవయ్యావు నాకు…అక్కున చేర్చుకోవట౦లో
చెల్లివయ్యావు నాకు….చిలిపి చేష్టలలో
తాతవయ్యావు నాకు…అనుభవాలు ప౦చట౦లో
మామయ్యవయ్యావు నాకు….నేనున్నా అని చెప్పట౦లో
బామ్మవయ్యావు నాకు …కథలు చెప్పట౦లో
ఇలా..అన్ని నీవై ..నీకు నీవే మలుచుకున్నావు నాన్నవై…
కనుకనే నిలిచావు ..నా జీవిత స్పూర్తివై..
కనుకనే నిలిచావు ..నా జీవిత స్పూర్తివై..
ఎల్లప్పుడు కోరుకున్నావు అభివృద్ది …నా మార్గదర్శివై..
నడిపావు నన్ను ధైర్యమై
నిలిచావు నువ్వు నా దైవమై…
నాలోని నీకు నేను రాస్తున్న కవిత
Subscribe to:
Posts (Atom)



